కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు ఎస్సీ కాలనీలో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. గురువారం 15వ ఆర్థిక సంఘం ఆరోగ్య నిధులు రూ.36 లక్షలతో ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమిపూజ చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.