KMM: కూసుమంచి మండల పరిధిలోని జీళ్ళచెరువు సబ్ సెంటర్ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు ఏఈవో రవీందర్ తెలిపారు. జీళ్ళచెరువు, మునిగేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు ఈ ఎరువులను అందజేయనున్నారు. గత శుక్రవారమే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు సమర్పించి టోకెన్లు పొందిన వారే అర్హులన్నారు.