AP: 2020లో రాయలసీమ ఎత్తిపోతలపై NGT స్టే వచ్చిందని మంత్రి పార్థసారథి గుర్తు చేశారు. జగన్ CMగా ఉన్నప్పుడే స్టే వచ్చిందని తెలిపారు. స్టే ఎత్తివేత కోసం 2021లో అప్పటి ప్రభుత్వం దరఖాస్తు చేసిందన్నారు. 2021లోనే NGT అదనపు వివరాలు ఇవ్వాలని అడిగిందని చెప్పారు. 2023 అక్టోబర్ వరకూ జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వలేదని.. 2 ఏళ్ల 4 నెలలపాటు ఎందుకు బదులివ్వలేదు? అని ప్రశ్నించారు.