అనంతపురం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సిబ్బందితో చైర్పర్సన్ బల్లా పల్లవి శుక్రవారం సమావేశమయ్యారు. యార్డులో రైతులకు అందుతున్న వసతులు, క్రయవిక్రయాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.