KMR: పార్టీలకు అతీతంగా గ్రామాలనుఅభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలను పార్టీల గుర్తులు రహితంగా స్వతంత్ర గుర్తులను కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తోంది. కానీ కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామ పంచాయతీ భవనానికి ఏకంగా బీజేపీ పార్టీ రంగులు అద్ది భవనాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.