KRNL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ వడ్డెర సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 11న నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వడ్డెర సంఘం నాయకుడు సుబ్బరాయుడు తెలిపారు. వడ్డే ఓబన్న స్వాతంత్ర సమరయోధుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.