GNTR: మంగళగిరి శివాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13న ఉ. 9 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నామాని గోపి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోటీలకు ప్రవేశం ఉచితం అన్నారు. పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయన్నారు. పాల్గొనేవారు ముగ్గు, రంగులు వెంట తెచ్చుకోవాలన్నారు.