AP: కాకినాడ జిల్లాలో Dy.CM పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంతో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కాకినాడ SP బిందు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై చర్చిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులను నియంత్రించడంపై చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు.