ASR: అల్లూరి జిల్లా, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈనెల 26న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఆశ్రమ పాఠశాల, పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.