CTR: నగరంలో వెంగళరావు కాలనీలోని ఓం శక్తి ఆలయంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఓం శక్తి భక్తులు పాల్గొన్నారు.