VZM: డెంకాడ మండలంలోని అమకాం గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రెవెన్యూ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.