AP: అమరావతిపై నిత్యం విషం చిమ్మే జగన్కు ఆ పేరెత్తే అర్హత లేదని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. YCP హయాంలో అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళలను పోలీసులతో కొట్టించారని, పాదయాత్ర చేస్తున్నవారిపై దాడులు చేయించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సినిమా సెట్టింగ్లతో భక్తి నాటకాలు ఆడినందుకే.. ఇప్పుడు YCP 11 సీట్లకు పరిమితమైందని దుయ్యబట్టారు.