వడోదర వేదికగా రేపు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా సాధన చేస్తున్నారు. దీంతో తమ అభిమాన క్రికెటర్లను స్టేడియంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వన్డే సిరీస్ తర్వాత రెండు జట్లు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.