GNTR: గుంటూరు ఏటుకూరు రోడ్డులోని దత్తాత్రేయ మహాసంస్థానంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన పవిత్రమైన దశమహావిద్య హోమం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమ కార్యక్రమాన్ని దర్శించి ప్రసాదం స్వీకరించారు.