వరంగల్ పోరాటాల పురిటి గడ్డ అని, వరంగల్ పోలీస్ అంటేనే ఎవర్ విక్టోరియస్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలో విశ్రాంత పోలీస్ ఉద్యోగుల సంఘం డైరీని నేడు ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘానికి తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తానని, సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి స్థల సేకరణకు కృషి చేస్తానన్నారు.