ADB: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో చైనా మాంజా, లక్కీ డ్రా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నెలవారీ సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. ప్రజలకు చట్టాలు, నేరాలు, సైబర్ క్రైమ్, మహిళలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని సూచించారు.