శ్రీకాకుళం: ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఇళ్లకు తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇది గమనించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.