TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ సంక్రాంతి ఆఫర్లు, డిస్కౌంట్లు, బస్సు, విమానం, రైలు బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆఫర్ల పేరుతో వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుంటే డేటా తస్కరిస్తారని.. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.