NLG: దేవరకొండ మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల(కొల్లిముంతల్ పహడ్)లో 9వ తరగతి చదువుతున్న బి.సాయితేజ 38వ జాతీయ సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ ఛాంపియన్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఎం. సాగర్ తెలిపారు. హర్యానా రాష్టంలో సంస్కారం యూనివర్సిటీ పాటోడాలో ఈ నెల 09 నుంచి 12 వరకు జరుగబోయే పోటీలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.