PLD: మాచవరం మండలంలోని సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండల్లో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్త నిధులు ఉన్నాయనే ఆశతో అర్థరాత్రి సమయంలో వీరు కొండపై రెక్కీ నిర్వహించి తవ్వకాలకు సిద్ధపడగా, రైతులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఎస్సై పవన్ తెలిపారు.