AP: తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు దొరకడంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతో కొత్త కథ అల్లారని.. మద్యం సీసాలు ఉన్నాయని బయటపెట్టిందే తమ కార్యకర్తలని తెలిపారు. కానీ, తమ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెట్టారని భూమన మండిపడ్డారు. ఎడిట్ చేయని సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి యత్నిస్తున్నారని విమర్శించారు.