W.G: చెరుకువాడలోని చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు శుక్రవారం కోరారు. ఆలయ ఛైర్మన్గా దండు రామకృష్ణంరాజు, వేణుగోపాలస్వామి ఆలయ ఛైర్మన్గా పి. త్రిమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా రఘురామ సూచించారు.