కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక దౌత్యవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. ప్రస్తుతం భారత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో, ప్రపంచ దేశాలతో సంబంధాలను పటిష్టం చేయడంలో జైశంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.