AP: చిత్తూరు జిల్లా పాఠశాలల్లో ‘కూల్ లిప్’ కలకలం రేపింది. పొగలేని ఫిల్టర్ పొగాకుకి విద్యార్థులు బానిసలు అవుతున్నారు. ఉపాధ్యాయుల తనిఖీల్లో గుట్టలుగా కూల్ లిప్ ప్యాకెట్లు బయటపడ్డాయి. మత్తులోనే క్లాస్‌లకు వస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల నుంచి చిత్తూరుకు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నట్లు సమాచారం.