AP: జగ్గన్నతోట ప్రభల తీర్థం సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న వేడుకని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని చెప్పారు. కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.