AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో చలిమంట నుంచి వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చలిమంట, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, కావాలనే చేశారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఆర్డోవో బాలకృష్ణ వెల్లడించారు.