SRPT: అనంతగిరి మండలంలోని 20 గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని క్రీడా ప్రాంగణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడం, మరికొన్ని పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.