MLG: కారును క్రేను ఢీకొట్టగా ఒకరు మృతిచెందగా పలువురికి గాయాలైన ఘటన ఏటూరునాగారం మండలంలో ఇవాళ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి 163పై కారు, భారీ క్రేను ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.