ఆల్మంట్-కిడ్ సిరప్ వాడకం నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించారు. సిరప్లో ఇథలీన్ గ్లెకాల్ కలుషితమై విషపూరితమైనట్లు గుర్తించారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఎవరివద్దనైనా ఉంటే.. వాడకం, విక్రయం నిలిపివేయాలని, పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. TG డ్రగ్ కంట్రోల్ విభాగం హెచ్చరిక నోటీసు జారీ చేసింది.