JN: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన పలువురు నేతలు, గ్రామస్తులు కలిశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎంపీకి వారి వివరించి గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎంపీ కోరారు.