SRPT: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ జంక్షన్ వద్ద చేపట్టిన రహదారి మరమ్మతులను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.