NZB: సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెండోరా SI సుహాసిని సూచించారు. శనివారం మండల ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు నగదు, బంగారాన్ని లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని కోరారు.