BHPL: మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, ప్రేమ్ నగర్ గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాల పై కాటారం, BHPL స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా ఇవాళ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల నాటుసారా, 20 కేజీల చక్కర, 2 కేజీల డైఈస్ట్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. 900 లీటర్ల చక్కర పానకాన్ని ధ్వంసం చేశారు. 3 కేసులు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.