KMR: బీర్కూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి బాలుర నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ శివ కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఫోటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు జనవరి 21 చివరి తేదీ అని ఆయన శుక్రవారం పేర్కొన్నారు.