AP: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక చెంచుపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద షేక్ ఫయాజ్(50) అనే వ్యక్తిపై దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫయాజ్ AC మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడని తెలిపిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.