HNK: భద్రకాళి అమ్మవారి రథ ఏర్పాటు అంశంపై పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిశారు. అమ్మవారి దివ్యకళ, శిల్ప సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని హంగులతో రథం రూపకల్పన చేయాలని, దసరా నవరాత్రి ఉత్సవాలకు ముందే రథం సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించి, అవసరమైన చర్యలను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.