W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. 26వ రోజు వేడుకల్లో భాగంగా స్వామి వారు చెరకు గడల మధ్య విశేష రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.