W.G: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాలకొల్లు నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై సూర్యుడు కనిపించడంలేదని స్థానికులు పేర్కొన్నారు. రెండో శనివారం సెలవు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. చలి తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.