NLG: దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంగోతు మోహన్ అన్నారు. దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారిని కలిసి ఆయన ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలని లేఖలో సూచించారు.