NGKL: నల్లమల ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన రంగాపూర్ హజరత్ నిరంజన్ షావలి దర్గా ఉత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సౌకర్యాలపై దృష్టి సారించినట్లు నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.