WGL: అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ (ABGP) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం బోల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ కొనుగోళ్లు, బ్యాంకింగ్ సేవల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిర్యాదు విధానంపై వక్తలు ఆయేషా బాను, దత్తాత్రేయ తదితరులు అవగాహన కల్పించారు.