ADB: బంజారా సమాజాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆయనను గురువారం సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీరామ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మాజీ ఛైర్మన్ ఉత్తమ్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.