నల్లగొండ పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రూ. 3 కోట్ల 14 లక్షల 60 వేల అంచనా వ్యయంతో పట్టణంలోని వల్లభరావు చెరువు అభివృద్ధి పనులకు మంత్రి ఇవాళ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యం, మెరుగైన సౌకర్యాల కల్పనే తమ లక్ష్యమని అన్నారు.