HYD: నగరంలో కాలుష్యం పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అల్కాపూర్ టౌన్ షిప్లో గాలి నాణ్యత సూచీ (AQI) ఏకంగా 187గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం దీనికి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు కట్టెల పొయ్యిల వాడకంతో గాలి మరింత క్షీణించి శ్వాసకోస సమస్యలు వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.