ATP: గార్లదిన్నె మండలం సిరివరం గ్రామానికి చెందిన నారాయణస్వామి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ADCC బ్యాంక్ చైర్మన్ ముంటి మడుగు కేశవరెడ్డి మానవత్వం చాటుకున్నారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడికి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.