KRNL: రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 25 వరకు ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా AO పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు విరామం ఉంటుందని చెప్పారు. రైతులతో సమావేశాలు నిర్వహించి 2026-27 వ్యవసాయ సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.