TG: ఖమ్మం జిల్లాలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని మే మొదటివారంలో ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు సూచించారు. గోద్రెజ్ సీడ్ గార్డెన్‌కు ఫ్యాక్టరీ దగ్గరలో భూమి కేటాయించాలని పేర్కొన్నారు. రైతులు వరి సాగు తగ్గించి పామాయిల్ వైపు దృష్టి పెంచాలని పిలుపునిచ్చారు. పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని వెల్లడించారు.