JGL: గోడౌన్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న గోడౌన్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ప్రగతిని ప్రతిరోజూ నివేదించాలని పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.