సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కోరుతూ కండర క్షీణత బాధితుల సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిశారు. సంఘం ప్రతినిధి మడపతి రవికుమార్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించగా.. వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.