TG: రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా చూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉండబోతున్నామని జోస్యం చెప్పారు. ఈ రెండేళ్లలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా తన వద్దకు వచ్చి నిధులు అడగలేదన్నారు.